
దీంతో రాబోయే మరో మూడు రోజులపాటు కూడా రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్నటి రోజున కురిసిన వాన దాటికి పిడుగులు బడి కృష్ణ గుంటూరు జిల్లాలో ఆరుగురు మరణించారు. ఇక కృష్ణాజిల్లాలో పిడుగులు పడి నలుగురు మరణించగా ఆవనిగడ్డ మండలం రామచంద్రాపురంలో మొక్కజొన్న పంట తడవకుండా బట్టలు కప్పుతూ ఉండగా పిడుగు పడటంతో వెంకటరామయ్య అనే వ్యక్తి మృతి చెందారు. పొలంలో పశువులు మేపుతూ ఉండగా పిడుగుపాటున మరొక వ్యక్తి మరణించారు. ఇక మరొక వ్యక్తి పిడుగుపాటు శబ్దానికి హార్ట్ ఎటాక్ తో మరణించారు మరికొన్నిచోట్ల పిడుగు పడి వరికుప్పలు పాడే గేదలు మృత్యువాత పడ్డాయి.
అకాల వర్షం కారణంగా మిరప రైతులకు కూడా చాలా నష్టం వాటిల్లుతోంది. గుంటూరు జిల్లాలో పిడుగుపాటు పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అందులో ఒకరు చాట్ల శాంబాయి.. మరొకరు కృపానంద మరణించినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ పిడుగు పడి స్పృహ కోల్పోవడంతో అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు హుటాహుటిగా పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే వీరిద్దరు మరణించినట్లుగా వైద్యులు గుర్తించారు. అందుకే రానున్న మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ.