
ముఖ్యంగా పెంపుడు కుక్కలు అయితే ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా విన్యాసం చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి ఒక టాలెంటెడ్ పెంపుడు కుక్కకు సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా మనుషుల్లాగానే కుక్క స్కేటింగ్ చేస్తూ ఉన్న వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇది చూసిన నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. అయితే కుక్క స్కేటింగ్ చేస్తున్న సమయంలో అర్జెంటుగా టాయిలెట్ రావడంతో.. వెంటనే స్కేటింగ్ బోర్డును పక్కన వదిలేసి ఇక పక్కనే ఉన్న గోడపై దాని స్టైల్లో టాయిలెట్ పోస్తుంది.
ఇక ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారగా.. ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక కుక్క ముందుగా స్కేటింగ్ బోర్డుపై స్కేటింగ్ చేస్తూ ఉంటుంది. అయితే మధ్యలో దానికి ఎంత అర్జెంటుగా టాయిలెట్ వచ్చిందో ఏమో వెంటనే స్కేటింగ్ బోర్డు నుంచి దిగి రోడ్డు పక్కన ఒక మూలకు వెళ్లి టాయిలెట్ పోస్తుంది. ఇక మళ్ళీ వచ్చే స్కేటింగ్ బోర్డు పైకి ఇక ముందుకు వెళ్లడం చేస్తూ ఉంటుంది. అయితే అది స్కేటింగ్ బోర్డుపై దిగడమే కాదు ఎక్కేటప్పుడు కూడా అచ్చం మనిషి లాగానే పైకి ఎక్కింది అని చెప్పాలి. అయితే ఇలా వెళ్తున్న సమయంలో మధ్యలో స్పీడ్ బ్రేకర్ కూడా వస్తుంది. అయినప్పటికీ ఆ కుక్క కాస్తైనా తొనక్కుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.