ప్రతి ఏడాది రెట్టింపు అవ్వాల్సిన జనాభా రోజు రోజుకి తగ్గిపోతుంది .. తప్పిస్తే ఎక్కడ పెరగడం లేదు . దీంతో ప్రభుత్వమే ప్రజలను పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనాల రేటు పడిపోవడంతో చాలా దేశాలు ఇప్పుడు వృద్ధ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వస్తున్నాయి . తక్కువ సంతాన ఉత్పత్తి రేటు కారణంగానే ఇలా జరుగుతుంది అని ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు . మరీ ముఖ్యంగా టర్కీలో జనాల రేటు 2001లో 2.38 ఉంటే ఇప్పుడు అనగా 2025 నాటికి అది 1. 48 కి పడిపోయింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిస్థితి పై అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ తన ఆందోళన వ్యక్తం చేశాడు . అంతేకాదు యుద్ధం కన్నా భయంకరంగా మారిపోయింది ఈ పరిస్థితి అంటూ అభివణించారు. 2026 నుంచి కుటుంబ దబ్దాన్ని ప్రారంభించాలని ప్రకటించాడు. కొత్త జంటలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రయత్నాలు కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అంతేకాదు ఇకపై భార్యాభర్తలు కచ్చితంగా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనే కొత్త రూల్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్షుడు . అంతేకాదు వియత్నం గత దశాబ్ద నాటి నుండి ఇద్దరు పిల్లల విధానాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ప్రజలు ఎంతమంది పిల్లలు కావాలంటే అంత మందిని కనుచూ అనేలా కొత్త రూల్ ని తీసుకొచ్చింది. కేవలం టర్కీ మాత్రమే కాదు ఉత్తరకొరియా - న్యూజిలాండ్- చైనా - వియత్నం లాంటి ఎన్నో దేశాలు కూడా ఈ సమస్య కారణంగా బాధపడుతున్నాయి . ఒకవేళ ఫ్యూచర్లో ఇదే విధంగా అందరూ అనుకొని పిల్లలను కనడం మానేస్తే ఖచ్చితంగా భూమిపై మానవాళి అనేది తగ్గిపోతుంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు..!!