
70 ఏళ్ల ఓ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. అసలు ఏమి తినలేక పోతున్నాను అని కడుపు పట్టుకుంటే నొప్పితో అల్లాడిపోతున్నాను అని ఈ కడుపునొప్పితో చచ్చిపోతానేమో అంటూ భయపడి పోయి ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కడుపునొప్పి అంటే సాధారణంగా డాక్టర్స్ అందరూ కూడా ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదేమోనని ..ఏదైనా తనకి పడని ఆహారాన్ని తీసుకున్నాడు ఏమో అని ఆ విధంగా టెస్ట్ చేస్తారు . అన్ని టెస్ట్లు చేశారు . అన్నీ కూడా సరిగ్గానే వచ్చాయి. అసలు ఎందుకు ఈ వ్యక్తి కడుపునొప్పితో ఇంత అల్లాడిపోతున్నాడు అని సందేహం వచ్చి ఎక్స్ రే తీసారు డాక్టర్లు .
అప్పుడే ఓ షాకింగ్ న్యూస్ బయటపడింది . అతని శరీరంలో ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ ఉన్నట్లు గుర్తించారు , శరీరంలో పెర్ఫ్యూమ్ బాటిల్ ఏంటి..?? అంటూ షాక్ అయిపోయారు. వెంటనే ఆయనకి శాస్త్ర చికిత్స నిర్వహించి సుమారు రెండు గంటలు అనంతరం ఆ బాటిల్ రోగి శరీరం నుంచి సక్సెస్ఫుల్గా తీసేశారు . ఆపై రోగి ఆరోగ్యం కూడా కుదుటపడింది. ఈ గ్యాప్ లో వాళ్ళు తెలుసుకున్న నిజం ఏంటంటే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు అని .. ఆ కారణంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా పెర్ఫ్యూమ్ బాటిల్ తో పిచ్చి పని చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అంటూ డాక్టర్లు చెప్పారు . డిశ్చార్జ్ చేసే ముందు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు డాక్టర్లు..!