నిరాశ ఓటమికి ముఖ ద్వారం వంటిది... అందులో నుండి ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా విజయం మన సొంతం అవుతుంది. ఓటమి గురించి భయపడకుండా, సాధించాలనే తపనతో ముందుకు సాగితే... మన సామర్థ్యమే మనలోని బలహీనతలను అధిగమించి గెలుపుకు చేరువయ్యేలా చేస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం ఉండనే ఉంటుంది. కానీ ఆ లక్షాన్ని సాధించడం అందరికీ సాధ్యం కాదు. దీనికి కారణం మరెవరో కాదు మీకు మీరే. ఎప్పుడైతే మీ లక్ష్యం దృఢంగా ఉంటుందో... ఎప్పుడైతే మీ సామర్థ్యాన్ని మీరు  పూర్తిగా నమ్ముతారో, ఎప్పుడైతే మీ లక్ష్యం ముందు ప్రతి సమస్య చిన్నదిగా కనబడుతుందో.... అప్పుడే అన్ని అడ్డంకులను అధిగమించి మీ లక్ష్యానికి చేరుకోగల మార్గం మీ ముందు కనబడుతుంది.  

ఉదాహరణకు కొందరు  గవర్నమెంట్ జాబ్స్ కి  ట్రై చేస్తుంటారు. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని పట్టుదలతో ఉంటారు...కానీ ఒకటి రెండు సార్లు ప్రయత్నించి విసుగు చెంది...ఇక మన వల్ల కాదని నిరాశ పడుతుంటారు....ఇలా చేయడం వల్ల మన లక్ష్యానికి పూర్తిగా దూరం అవుతాం. ఎప్పుడైతే మనోధైర్యాన్ని పెంచుకుని మన సామర్ధ్యాన్ని నమ్మి తిరిగి ప్రయత్నాలు మొదలుపెడతామో చివరకి మనం అనుకున్నది సాధించగలం. అందుకనే ప్రతి మనిషికి తమ గోల్ సాధించడం కోసం తెలివితేటలతో పాటు సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం కూడా చాలా అవసరం. ఇవి లేనప్పుడు ప్రతి చిన్న అడ్డంకి పెద్ద సమస్యలా కనిపిస్తుంది.

దాంతో మనిషి నిరాశ చెంది ఉన్న చోటే ఆగి పోతుంటాడు. ఎప్పుడైతే వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళుతామో అప్పుడు మనమనుకున్నది తప్పక సాధించి లక్ష్యాన్ని చేరుకుంటాను. పట్టుదలతో చేసే ఏ ప్రయత్నమైనా విజయాన్ని తప్పక ఇస్తుంది...ఈ సిద్ధాంతాన్ని నమ్మి నడవండి గెలుపు గమ్యాన్ని చేరుకోవచ్చు. కాబట్టి మిత్రులారా నిరాశ అనే పదాన్ని మీ జీవితానికి దూరంగా ఉంచండి. మీ జీవితం గెలుపు బాటలో పయణిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: