పెద్దవాళ్ళు అంటుంటారు కదా, 'ఏ చెట్టుకు ఆ గాలి అని...' ఇది నిజమే ఈ ప్రపంచంలో అస్సలు సమస్యలు అనేవి ఉండని వారు ఉండరు. ఎంత గొప్ప వారు అయినా, కడు పేదవారైనా ఎవరికుండే సమస్యలు వారికుంటాయి. కాబట్టి సమస్యలను చూసి పరుగులు తీయకుండా. అలసి పోయి ఆగి పోకుండా అనుకున్నది సాధించడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు మన వారి కోసం మన విజయాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. త్యాగం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు బాగా ఆలోచించండి ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.
విజయానికి చేరువ కావాలంటే అన్నింటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని సార్లు కొత్త కొత్త అనుభవాలు ఎదురు కావొచ్చు. కానీ వెనక్కు తగ్గ కూడదు, అన్నింటినీ ఎదుర్కుంటూ సాల్వ్ చేసుకుంటూ విజయం వైపు దూసుకు వెళ్ళాలి. కొన్ని సార్లు మనలో సామర్ధ్యం ఉన్నా దేవుడు కొని కఠిన పరీక్షలను పెడతాడు. అలంటి సమయంలో మనము గట్టిగా ఉంటే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఇక్కడ దేనువుడ్ అంటే ఎవరో కాదు మీ కష్టం మరియు శ్రమే దేవుని ప్రతి రూపం. కాబట్టి కష్టం లేదా సమస్య ఏది వచ్చినా భయపడకుండా ముందుకు సాగండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి