ఇప్పటి కాలంలో పేరెంటింగ్ అనేది అత్తి కష్టమైన టాస్క్ అయిపోయింది ప్రతి తల్లితండ్రులకు. అంతే కాదండోయ్ అదొక పెద్ద కళ కూడా, దాన్ని అందరూ సరిగ్గా పూర్తి చేయలేరు కూడానూ, పిల్లల ఆలనా పాలనా చూసుకోవడంతో పాటు వారికి ఈ సమాజంపై ఒక అవగాహనను కూడా క్రియేట్ చేసే బాధ్యత కూడా తల్లిదండ్రుల పైనే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఏది స్వేఛ్ఛ, ఏది స్వతంత్రత అనేది కూడా వారికి నేర్పించాలి. అలాగే వారు ఎవరి మీదా ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునే నేర్పరి తనాన్ని కూడా వారికి నేర్పించాలి. దానికోసం తల్లిదండ్రులు ఏమి చేయాలి అనేది మనం ఎప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

అవకాశాలను అందివ్వండి

సాధారణంగా పిల్లలు ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని ఫినిష్ చేసేదాకా వేచి చూడాలి. అలాగే పెద్దలు చేసే పనులను పిల్లలు అనుకరించడంలో ముందుంటారు. అందుకోసం పిల్లల చేసే ప్రయత్నాన్ని ఆపకుండా వారికి మన వంతు సహాయాన్ని అందించాలి.

శిక్షణకు సమయం ఇవ్వండి

స్వతంత్రత అనేది ఒక్క రోజులో నేర్పిస్తే వచ్చేది కాదు. కాబట్టి దాని కోసం పిల్లలకి తగిన సమయం ఇవ్వాలి. అలాగే వారికి అనువైన వాతావరణాన్ని కూడా క్రియేట్ చేయాలి. ఇంకా పిల్లలు చేసిన ఏ పని అయినా నచ్చినపుడు మనం వారిని ఎక్కువగా పొగడకూడదు. అలా అని అస్సలు పట్టించుకోకుండా కూడా ఉండకూడదు.

పట్టుకు కూర్చోవద్దు

అలాగే పిల్లలు ఎప్పుడు ఏం చేస్తున్నారా అని వారిని గమనిస్తూ వారు చేసే తప్పులను కూడా  చెబుతూ ఉండకూడదు. అలా చేయటం అస్సలు మంచిది కాదు. తప్పులు చేయనివ్వాలి కూడా అలా అయితేనే పిల్లలకి కూడా  అనుభవంగా అర్థం అవుతుంది. అసలు తప్పే చేయకూడదు అనుకోవడం అన్నింటి కన్నా పెద్ద తప్పు.

ఛాయిస్ తీసుకోనివ్వండి

పిల్లలు వాళ్ళంతట వాళ్ళే ఒక నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకే ఇవ్వాలి. అల కాదు అనుకుంటే వాళ్ళకి అఫర్ లాగా కూడా ఇవ్వడం మంచిది. అప్పుడు వాళ్ళు ఏది ఎంచుకుంటారో వాళ్ళనే నిశ్చయించుకొని చెప్పవచ్చు.

అపజయాలకు కుంగిపోవద్దు

అలాగే ఎప్పుడైనా తప్పులు జరిగాయని ఒత్తిడికి గురి అయ్యి, ఆ ఒత్తిడిని  పిల్లలపై పడేలా చేయకూడదు. దానివల్ల  వారు చేసే ప్రయత్నం చేయకూడదనే ఫీలింగ్ వాళ్లకి కలుగుతుంది.

సమస్యలను పరిష్కరించనివ్వండి

పిల్లలు పాఠశాలలో, పార్కులో లేదా తోటి స్నేహితులతో ఆడేటపుడు అయినా వాళ్ళకి ఏవైనా సమస్యలు ఎదురైతే  వాటికి తగిన పరిష్కారం వారే వెతుక్కునేలా ప్రోత్సహించండం మంచిది.

ప్రోత్సాహం, పొగడ్త

సాధారణంగా ఒక పనిలో ఓడిపోయినప్పటికీ పిల్లలకి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తూ  వారి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఇలా చేయటం వలన వారికి మరో సారి  ప్రయత్నం చేయాలి అన్న కోరిక కలుగుతుంది.

ఇలా పైన తెలిపిన అన్ని విషయాల పట్ల పిల్లలకు అవగాహన కల్పించి వారికీ వారే ఫ్రీడమ్ గా అన్ని నిర్ణయాలు తీసుకునేలా వారికి శిక్షణ ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: