ఆడవాళ్ళు  అందంగా కనిపించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పది మందిలో ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఎంతగానో తాపత్రయపడతారు. ఆ ప్రత్యేకత వచ్చేది కేవలం అందం వల్లే మాత్రమే  అనడంలో అతిశయోక్తి లేదు. ఇంట్లోనైనా, ఆఫీసు లోనైనా, ఫంక్షన్స్ లోనైనా ఆకర్షణీయంగా కనబడటానికి అందరు ఇష్టపడతారు.అందుకే  అందుకే బ్యూటీ పార్లర్ లకి గాని, బ్యూటీ ప్రొడక్ట్స్ కుగాని అంతా డిమాండ్. అయితే బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ డబ్బులు వృదాచేసేకంటే ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండి..
అలాంటి వారికోసమే ఈ సింపుల్ ఫేషియల్ ప్యాకేజేస్  మీకందిస్తున్నాము.. మరెందుకు ఆలస్యం, మీరు ఏ ఫేషియల్ చేయించుకోవాలను కుంటున్నారో మీరే ఎంచుకుని , మీరే తయారు చేసుకుని,మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి..



ఒక కప్పు నిండా స్ట్రా బెర్రీస్, పీచెస్, నిమ్మరసం, ఒక అరటిపండు.తీసుకోవాలి. దీనిలో 2-3 స్పూన్స్ డబుల్ క్రీం, 3 స్పూన్స్ వెన్న, 1 స్పూన్ బెల్లం, 4 స్పూన్ ల ఓట్ మీల్ పౌడర్ అన్ని కలిపి  బ్లెండ్ చేసి 15 నిమిషాలు మొహానికి రాసుకుని గోరువెచ్చటి తో నీటితో కడగండి.అంతే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. అలాగే తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదో అందానికి కూడా అంతే మంచిది. తేనెతో పేస్ మాస్క్ ఎలా వేసుకోవాలో చూద్దాం. 1 1/2 స్పూన్  తేనే, గుడ్డులోని తెల్లసొన, 2 స్పూన్ ల గ్లిసరిన్, 1/3 కప్పు శనగపిండి, వీటన్నింటినీ కలిపితే చిక్కటి పేస్ట్ లా తయారవుతుంది . దాన్ని 15 నిమిషాల పాటు మొహానికి పెట్టుకుని గోరువెచ్చటి నీటితో కడిగేయండి. ఈ మిశ్రమం చర్మాన్ని మాయిస్చర్ చేసి స్కిన్ ని టైటనింగ్ చేసి చర్మం స్మూత్ గా సాఫ్ట్ గా అయ్యేలా చేస్తుంది.

టమాట మాస్క్:

కావలసినవి :

1/2 టమాట ( టమాట తోలు, గింజలు లేకుండా చేసుకోవాలి)
2 స్పూన్ పెరుగు
1 స్పూన్ సన్నగా తరిగిన కీరదోస
3-4 స్పూన్ ల ఓట్ మీల్ పౌడర్
3 పుదీనా ఆకులు

వీటన్నింటినీ కలిపి మొహానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఈ మాస్క్ ఆయిలీ స్కిన్ ఉన్నవారికి బాగా ఉపకరిస్తుంది. టమాట లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉన్నాయి. అలాగే బొప్పాయి గుజ్జును మొహానికి రాసుకుని 5 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. బొప్పాయి లో ఉండే పపైన్ అనే ఎంజైమ్ చర్మానికి బాగా ఉపకరిస్తుంది.పుచ్చకాయ గుజ్జును మొహానికి రాసుకుని 5 నిమిషాల పాటు ఉంచితే మొహంలోని మలినాలన్నీ శుభ్రం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: