
ఎందుకంటే గర్భం దాల్చిన మరుక్షణమే ఒక్కరు కాదు ఇద్దరు. అప్పుడు తీసుకునే ప్రతి ఒక్కటీ కడుపులో ఉండే బిడ్డకు కూడా అందుతుంది. తిండి మీద ఏ మాత్రం అశ్రద్ధ వహించినా లోపల బిడ్డపై ప్రభావం పడుతుంది. తల్లీ ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ఇందులో ఎక్కువ మోతాదులో పొటాషియం, లవణాలు ఉంటాయి.
అలాగే మాసాహారం, గుడ్లు తినొచ్చు. ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే బీట్‌రూట్, క్యారెట్ తినడం చాలా మంచిది. బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు క్యారెట్ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి.పండ్లు, కూరగాయలతో పాటు పాలు, మాంసం, గుడ్లు, చేపలు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. గర్భిణీల్లో రక్తహీనత ఉంటే తల్లీకి అధిక రక్తస్రావం జరుగుతుంది. బిడ్డ తక్కువ బరువుతో పుడతారు. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, బెల్లం, రాగులు, కర్జూరం, ద్రాక్ష, నువ్వులు, చెరకు రసం, ఉలవలు తీసుకోవాలి.
ప్రెగ్నెన్సీ సమంయలో జున్ను తినడం కూడా మంచిదే. ఇందులో అధిక కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అజీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు మిరియాలను కలుపుకుని తినాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకుని వారి సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తగిన ఆహారంతో పాటు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో చూశారుగా. ఇలాంటి సమస్యల గురించి ఎవరికీ తెలియదు. దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి.