
అయితే, గర్భం దాల్చిన సమయంలో లిప్‌స్టిక్, మాయిశ్చరైజర్లు, ఇతర కాస్మోటిక్స్ పరికరాలకు దూరంగా ఉండాలి. కెమికల్‌తో కూడిన ఈ పదార్థాలను వాడినప్పుడు తల్లితోపాటు కడుపులో ఉండే పిల్లాడిపై ప్రభావం చూపుతుంది. తాజాగా కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు మేకప్ వాడే గర్భిణులపై పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనలో వారికి పలు విస్తుపోయే విషయాలు తెలుసుకున్నారు. గర్భం దాల్చినప్పుడు స్త్రీలు మేకప్ వేసుకోవడం వల్ల వారి కడుపులో ఉండే పిల్లాడిపై కెమికల్స్ ప్రభావం పడుతుందని తెలుసుకున్నారు.
దీని వల్ల పుట్టబోయే పిల్లాడు యాక్టివ్‌గా లేకపోవడం, బుద్ధి మందగించడం, మానసికంగా అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. అందుకే గర్భవతిగా ఉన్న సమయంలో ఫేషియల్ క్రీమ్స్, మేకప్స్, కాస్మోటిక్స్‌కు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అప్పుడు తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలని సూచిస్తున్నారు. గర్భవతి ఉన్నప్పుడు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఒకేసారి కడుపు నిండేలా తినకుండా.. ఆకలి వేసినప్పుడు కొంచెం కొంచెం ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే కడుపులో ఉండే పిల్లాడికి శక్తి అందుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.