దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకడం వలన స్త్రీ రోగనిరోధక వ్యవస్థ ఆమె గర్భం ధరించినప్పుడు బలహీనపడుతుంది. దానితో ఆమెకి ఇన్ ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్ ఫెక్షన్ల వల్ల తల్లికి మాత్రమే కాదు గర్భంలో ఉన్న బిడ్డకీ, ప్రసవానంతరం శిశువుకీ కూడా ప్రమాదమే అని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గర్భిణీలకూ, బాలింతలకూ మామూలు వాళ్లకంటే ఎక్కువగా ఇన్ ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందన్న సాక్ష్యాలేమీ లేకపోయినా, వాళ్ళ శరీరంలో జరిగే మార్పుల వల్ల వాళ్ళు కొన్ని తీవ్రమైన ఇన్‌ఫెక్షన్స్ బారినపడే అవకాశముంది. అయితే ఇక ప్రస్తుతం భారత్ లో కోవిడ్-19 వల్ల ప్రసూతి మరణాలు రేటు 1.3 శాతంగా ఉందని, అందులోనూ కాస్త వయసు పైబడిన తర్వాత గర్భం ధరించే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది.

ఇక కరోనా వల్ల మరణించే గర్భిణుల సంఖ్య మిగిలినవారిలాగే తక్కువగానే ఉన్నా… లాక్ డౌన్ వల్ల ఆసుపత్రుల్లో కేసులు అధికంగా ఉండడం వల్ల జరిగిన ఆలస్యం కారణంగా గర్భ సబంధిత సమస్యలతో మరణించే వారి సంఖ్య పెరిగిందని అధ్యయనకారులు తెలిపారు. ఇంకా జన్మించకుండానే కడుపులోనే మరణించిన శిశువుల సంఖ్యను ఈ జాబితాలో లెక్కించకపోవడం దరదృష్టకరమని వారు అన్నారు. ఆసుపత్రుల్లో స్టిల్ బర్త్స్ కోసం రిపోర్ట్ వ్యవస్థ ఉన్నప్పటికీ సామాజిక స్థాయిలో లేదని ఆయన స్పష్టం చేశారు.

అయితే సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో రోజూ కేసుల సంఖ్య ఎక్కువవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరం కొనసాగుతున్నా.. కేసుల పెరుగుదల అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధులతో పాటు గర్భిణీలపై ప్రభావం చూపుతున్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: