చేతన జైన్.. 50 మంది ఉద్యోగులున్న సొంత సంస్థకు సీఈవో.
తండ్రి స్థాపించిన సంస్థ ను వారసత్వంగా అందిపుచ్చుకునే వారసులు ఉన్న
ఈ రోజుల్లో సొంతంగా తన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకుంది. ఆర్కిటెక్ట్ రంగంలో మహిళలు లెక్కలేనంత మంది ఉన్న మాట నిజమే కానీ ఎక్కువ మంది మగవాళ్ళు స్థాపించిన సంస్థలో ఉద్యోగులు గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి కొందరు ఇంటీరియర్ డిజైనింగ్ వైపు మరలి పోతుంటారు. అలాంటి సమయంలో 20 ఏళ్ల కిందట ఆర్కిటెక్ట్ సంస్థను స్థాపించి నిర్మాణ రంగంలో తనదైన పాదముద్రలు వేస్తోంది చేతన జైన్.
హైదరాబాదులో పుట్టి పెరిగిన ఈమెది గుజరాతి వ్యాపార కుటుంబం. ఆర్కిటెక్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రైవేటు ప్రాజెక్టుల ను విస్తృతంగా చేస్తున్నారు ఆమె.
కార్పొరేట్ కంపెనీ యాజమాన్యం నుంచి తాపీ మేస్త్రీల వరకూ అందరితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. ఏ నేలమీద ఉంటే ఆ భాష నేర్చుకుని తీరాలనే తన తల్లి అనుసరించే బాట తన విజయానికి పునాది అన్నారు. కనీసం బస్సుల మీద పేర్లు అయినా చదవగలిగేలా సదరు భాషలు నేర్చుకోవాలి అనేది మా అమ్మ నేర్పిన పాఠం. అలా తెలుగు లాంగ్వేజ్ ను సెకండ్ లాంగ్వేజ్ ఎంచుకుని తెలుగు చదివాను.
ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ లో ఏం పని చేయాల్సి ఉంటుంది అని అడిగి తెలుసుకుని మా అమ్మ
పెళ్లి అయన తర్వాత ఇంట్లో ఉండి కూడా పని చేసుకోవచ్చు అని ఆర్కిటెక్చర్ లో జాయిన్ చేసింది. ఆర్కిటెక్చర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జంషెడ్పూర్ లో ఎంబీఏ చేశాను. ఆ తరువాత వివిధ సంస్థలలో పని చేసిన నేను సొంతంగా కంపెనీ పెట్టాలనే ఆలోచన చేసి సంస్థను స్థాపించాను. ఆమె కట్టడాల్లో దీంతో కష్టమైనది గా మోహింజాహీ పునర్నిర్మాణ కట్టడాన్ని చెప్పింది. వారసత్వ హోదా ఉన్న కట్టడాన్ని పునరుద్ధరించాలంటే నైపుణ్యం కంటే ఎక్కువగా అంకితభావం ఉండాలి. మోహింజహీ
మార్కెట్ 2016లో మొదలుపెట్టి ఆరు నెలలకు పైగా పనిచేసి పూర్వ నిర్మాణనికి తీసుకువచ్చాను. అలా ఆర్కిటెక్ట్ గా ఆమె ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు కట్టి ఇప్పుడు ఇంత స్థాయికి చేరుకున్నారు.