గెర్ ట్రూడ్ ఎడెర్లే పేరు  ప్రపంచానికి తెలియదు కాని అట్లాంటిక్ సముద్రంలో నౌక రవాణా జరిగే అత్యంత రద్దీ ప్రాంతమైన ఇంగ్లీష్ ఛానెల్ ను ఇదిన మొదటి మహిళా ఎడర్లే గా మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. 

అమెరికా లోని న్యూయార్క్ పట్టణంలో 1905 అక్టోబర్ 23న జన్మించిన ఎడర్లే చిన్నతనం నుంచే స్విమ్మింగ్ అంటే మక్కువ . స్విమ్మింగ్ పట్ల కుమార్తె లో ఉన్న ఆకర్షణ ను గమనించిన ఆమె తండ్రి స్విమ్మింగ్ శిక్షణ తరగతులలో చేర్పించారు. అక్కడ స్విమ్మింగ్ లో పలు మెలకువలు నేర్చుకున్నారు. 

1921-25 మధ్య ఆమె 29 జాతీయ , ప్రపంచ అమెచ్యూర్ స్విమ్మింగ్ రికార్డులను సొంతం చేసుకున్నారు. న్యూయార్క్ లోని బ్రైటన్ బీచ్ లో 1922లో ఒకే  ఈతలో ఆమె ఏడు రికార్డులు సాధించారు. 

1924 పారిస్ ఒలింపిక్స్ లో 4x100 మీటర్ల ప్రిస్టైల్ రిలేలో స్వర్ణ పతకం సాధించిన అమెరికన్ బృందం లో ఆమె ఒకరు. 1925లో ఇంగ్లీష్ ఛానెల్ ఇదడానికి ప్రయత్నించి వైఫల్యం చెందిన 1926లో మరోసారి ప్రయత్నించడానికి ఫ్రాన్స్ వెళ్లారు. 

ప్రాన్స్ లోని కేప్ గ్రిస్ నెజ్ అనే చోట మొదలు పెట్టి ఇంగ్లండ్ లోని డోవర్ అనే చోటు వరకూ 14 గంటల 31 నిమిషాల్లో  35 మైళ్ళు (56 కిలోమీటర్లు) ఈదారు. ఇంత తక్కువ సమయంలో ఈదిన మొదటి స్విమ్మర్ గా మరియు మొదటి మహిళా నిలిచారు. 

 ఇంత గొప్ప రికార్డును సాధించిన వ్యక్తిగతంగా మాత్రం చాలా బాధాకరమైన విషయం చోటుచేసుకుంది ఛానెల్ ను ఈదుతున్న సమయంలో ఆమె తన వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయారు. ఆ తరువాత నుంచి ఎడర్లే స్విమ్మింగ్ శిక్షకురాలిగా మారి భాదిర బాలలకు స్విమ్మింగ్ లో శిక్షణ ఇస్తూ తన జీవితాన్ని గడిపారు. 

1965లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ , 1980 లో విమెన్స్ స్పోర్ట్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నారు. 

జీవితాంతం అవివాహిత గా ఉన్న ఎడర్లే తన 98 ఏటా 2003, నవంబర్ 30 తేదీన మరణించారు. 

ఎడర్లే స్పూర్తితో ఏంతో మంది మహిళలు తరువాత కాలంలో ఇంగ్లీష్ ఛానెల్ ను ఈదారు.

మరింత సమాచారం తెలుసుకోండి: