పెళ్ళైన ప్రతి మహిళ బిడ్డకు జన్మనిచ్చి తన మాతృత్వాన్ని పంచాలని చాలా కలలు కంటూ ఉంటుంది. వారు గర్భం దాల్చిన రోజు నుండి శిశువుకు జన్మనిచ్చే వరకు మహిళలు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే.. గర్భిణీ మహిళలు తీసుకునే ఆహారంపైనే కడుపులోని బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మొదటిసారి గర్భం దాల్చిన మహిళలకు ఎం తినాలో ఎం తినకూడదో పెద్దగా తెలీదు. అందుకే మొదటిసారి గర్భం దాల్చిన మహిళలు ఎక్కవగా వైద్యుడి సూచిన ఆహారపదార్థలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

అయితే కూరగాయలలో చాలామందికి నచ్చని కాయ కాకరకాయ అనే చెప్పాలి. ఎందుకంటే..  కాకరకాయ చేదుగా ఉండటం వల్ల ఎంతోమంది దీనిని తినడానికి పెద్దగా ఇష్టాన్ని చూపించారు. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే..  కాకరకాయలో అధికంగా ఫైబర్ లభిస్తుంది. ఇక ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాకరకాయ తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. అంతేకాదు.. ఈ కాకరకాయను కనీసం వారంలో ఒక్కసారైనా తీసుకోవడం మంచిదని అంటున్నారు.

మహిళలు కాకరకాయ తినడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే  మలబద్ధకం సమస్య, జీర్ణక్రియ సమస్యలు దూరం అవుతాయని వైద్యులు తెలిపారు. ఇక కాకరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చునని అన్నారు. కాగా.. గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి వాటిలో జీర్ణక్రియ, మలబద్ధక సమస్య ఎక్కువగా తలెత్తుంటాయి.

అంతేకాదు.. కాకరకాయ చేదుగా ఉంటుందని  పైన పీచు తీసి కాకరకాయలు తినడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఇక గర్భధారణ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే  పోషకాహారం తీసుకోవడం వలన శిశువు పెరుగుదలకు ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కాకరకాయ పైన పీచు తీయకుండా వండుకోవడం ఉత్తమం అని అంటున్నారు. ఇక వారంలో ఒకటి లేదా రెండు సార్లు కాకరకాయ తింటే ప్రగ్నెన్సీ సమయంలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టొచున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: