ప్రాచీన కాల సంప్ర‌దాయ‌మైన శ్రీ‌వారికి గో ఆధారిత నైవేద్యం మేనెలోనే ప్ర‌వేశ‌పెట్టాం అని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో ముచ్చ‌టించారు. ఎలాంటి ఆటంకం లేకుండా గోఆధారిత నైవేద్యం నిర్విఘ్నంగా కొన‌సాగుతోంది అని వెల్ల‌డించారు. శాశ్వ‌తంగా చేప‌ట్ట‌డానికి ప్ర‌ణాళికను సిద్ధం చేసి ముందుకెళ్తున్నాం అని వివ‌రించారు.

ఈనెల 30,31న గో మ‌హాస‌మ్మెళ‌నాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. గోఆధారిత వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్టు వివ‌రించారు. స్వామివారికి గ‌త నెల‌లో న‌వ‌నీత సేవ కార్య‌క్ర‌మం ప్రారంభించాం. అందుకోసం అవ‌స‌రం అయ్యే నెయ్యిని తిరుమ‌ల‌గోశాల‌లో తయారు చేస్తున్నాం. గోశాల విస్త‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం అని వెల్ల‌డించారు. గ‌తంలో 15 గోవులు మాత్ర‌మే ఉండేవి. ప్ర‌స్తుతం గోశాల‌లో 60 గోవులు ఉన్నాయి. భ‌విష్య‌త్‌లో 150 గోవులు ఉండేలా ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.

శ్రీ‌వారికి స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని వినియోగించేవిధంగా ప్ర‌ణాళిక‌లు రూపొందించాం. రాజ‌స్థాన్ ఫ‌త్ మేడలోని ఒక గోషాల‌లో సూచ‌ల‌ను కూడ తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి అంత‌రాయం ఏర్ప‌డ‌కుండా 4 ల‌క్ష‌ల టికెట్ల‌ను కేటాయింపు ఆన్‌లైన్‌లో అందించాం. న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు టికెట్ల‌ను అందించాల‌ని విన‌తులు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో సాధ్య‌సాధ్యాల‌ను ప‌రిశీలించి న‌డ‌క‌దారి టికెట్ల కేటాయింపుపై నిర్ణ‌యం తీసుకుంటాం అని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు.

మ‌రొక‌వైపు శ్రీ‌వారికి సంబంధించిన ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో  విడుద‌ల చేసింది టీటీడీ. న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ నెల‌ల‌కు  రూ.300 టికెట్ల‌ను అందుబాటులో ఉంచింది. అందుబాటులోకి తెచ్చిన గంట‌సేప‌టి కాలంలోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.  కేవ‌లం  గంట‌ వ్య‌వ‌ధిలోనే 4ల‌క్ష‌ల 20వేల టికెట్లు అమ్ముడు పోయాయి. రేపు స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేనుంది. ఈనెల 25న న‌వంబ‌ర్ నెల‌కు సంబంధించిన వ‌స‌తిగ‌దుల కోటాను విడుద‌ల చేయ‌నుంది. స‌ర్వ‌ర్ ఇబ్బందులు లేకుండా టికెట్ల బుకింగ్ కొన‌సాగింది. భ‌క్తుల నుంచి టికెట్ల విక్ర‌యించ‌డానికి ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: