ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.ఇక అదేంటంటే జైపూర్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ హాప్ ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలను తగ్గించింది.ఓక్సో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, ఎలక్ట్రిక్ స్కూటర్లు లియో ఇంకా లైఫ్ ధరలను ఒకేసారి తగ్గించింది. నిజానికి ఫేమ్2 సబ్సిడీలను ప్రభుత్వం తగ్గించడంతో అంతా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అమాంతం పెరిగిపోతాయని భావిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలకు ఈ సబ్సీడి తగ్గించడంతో ఉత్పత్తి వ్యయం అనేది గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరగడం అనివార్యం అని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఆ ప్రచారానికి చెక్ పెడుతూ హాప్ స్టార్టప్ తన ఉత్పత్తుల ధరలను పూర్తిగా తగ్గించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు ఇంకా బైక్ ధరను కూడా అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం హాప్ పోర్ట్ ఫోలియోలో మొత్తం మూడు ఈవీలు ఉన్నాయి.అందులో లైఫ్, లియో స్కూటర్లతో పాటు ఓక్సో ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులో ఉన్నాయి.ఈ సంవత్సరం ప్రారంభంలో హై స్పీడ్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లియోను లాంచ్ చేసింది. ఇంకా ఇది కాక లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైఫ్ ఉంది. వీటి ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. ప్రస్తుతం తగ్గించిన ధరలు అయితే ఇలా ఉన్నాయి.. లియో స్కూటర్ ధర వచ్చేసి రూ. 84,000గా ఉంది.


 ఇంకా అలాగే లైఫ్ స్కూటర్ ధర వచ్చేసి రూ. 67,500గా ఉంది. ఇంకా అదే విధంగా హాప్ కంపెనీ నుంచి వస్తున్న ఓక్సో మోటార్ సైకిల్ ధర వచ్చేసి రూ. 1.65లక్షల నుంచి 1.48లక్షలకు తగ్గింది. ఇది నాలుగు రంగుల్లో దొరుకుతుంది. ఈ బైక్ మనకు బ్లాక్, బ్లూ, గ్రే, రెడ్, ఎల్లో కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.ఇక హాప్ స్టార్టప్ కు చెందిన ఈ ఓక్సో బైక్ మంచి స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది.అలాగే ఇది రైడర్ కి సౌకర్యంతో పాటు మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా ఇస్తుంది. ఈ బైక్ స్పెసిఫికేషన్లు కనుక పరిశీలిస్తే 3.75 కిలోవాట్అవర్ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. అలాగే 5.2కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఉంటుంది. ఇది 200ఎన్ఎం మాక్సిమం టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ మొత్తం సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం నాలగు సెకన్లలోనే అందుకుంటుంది. ఇది టాప్ స్పీడ్ గంటకు 95 వేగంతో దూసుకెళ్తుంది. ఇటీవల ఈ బైక్ లో ఫోటా వీఈఆర్ 4.90 అప్ డేట్ కూడా వచ్చింది. ఇక ఇది ఎకో మోడ్లో మరింత అధిక పనితీరును కనబరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: