పాఠశాలల వీలినం పేరుతో ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఇబ్బందులకు గురి చేస్తుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 18 వేల పాఠశాలలను మూసి వేయడంతో పాటు.. 50 వేల మంది ఉపాధ్యాయులను శాశత్వంగా ఇంటికి పంపాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సీఎం జగన్ అనేక హమీలు ఇచ్చారని నేడు వాటిని బుట్టదాఖలు చేశారని వారు విమర్శించారు.


అందుకే రానున్న ఎన్నికల్లో  అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి అభ్యర్ధులను నిలుపుతున్నాయని వారు అంటున్నారు. అందుకే ఉపాధ్యాయులు ఆ అభ్యర్ధులను గెలిపించాలని ఉత్తరాంధ్ర ఉపాద్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధులు కోరుతున్నారు. 2023 మార్చిలో ఏపీలో ఐదు స్ధానాల్లో ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధుల పరిచయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2023 మార్చిలో ఏపీలో ఐదు స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయని.. వైసీపీ ఆ స్థానాల్లో కూడా తమ అభ్యర్ధులను పొటి పెట్టాలని చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap