కరోనా మహమ్మారి పుట్టిన పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ సోకుతూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, పిల్లలు కరోనా భారీన పడితే చనిపోయే అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరు వృద్ధులు కరోనా నుంచి కోలుకుంటూ వైద్యులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. మహారాష్ట్రలోని పుణేలో కొన్ని రోజుల క్రితం వృద్ధురాలికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పక్షవాతానికి గురైంది. 
 
ఆమె శరీరంలో ఎడమ వైపు భాగాలు చచ్చుబడిపోగా కొన్ని రోజుల క్రితం ఆమెలో కరోనా సంబంధిత లక్షణాలు కనిపించాయి. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. ఆమెకు వయస్సు మీద పడటం... పైగా ఎడమ వైపు భాగాలు చచ్చుబడిపోవడం... కరోనా సోకడంతో బ్రతకడం కష్టమే అని వైద్యులు భావించారు. కానీ వృద్ధురాలు కరోనాను జయించి వైద్యులు ఆశ్చర్యపోయేలా చేసింది. 
 
మనో ధైర్యం ఉంటే ఏ వ్యాధినైనా జయించటం కష్టం కాదని వృద్ధురాలు నిరూపించింది. పూణే ఎస్‌యూహెచ్ఆర్ సీఈవో డాక్ట‌ర్ విజ‌య్ న‌ట‌రాజ‌న్ మీడియాతో మాట్లాడుతూ వృద్ధురాలి ధైర్యం ముందు వైరస్ పారిపోయిందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: