దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఇలాంటి సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోలీసులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మండుటెండలో నిద్రాహారాలు మాని విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు కావడానికి కృషి చేస్తున్నారు. తాజాగా పోలీసుల కృషిని అభినందిస్తూ గేయ రచయిత చంద్రబోస్ ఒక పాట రాసి తానే స్వయంగా పాడారు. 
 
పలు చోట్ల పోలీసులపై కొందరు దాడి చేయడాన్ని విమర్శిస్తూ అద్భుతంగా పాట రాశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచనల మేరకు చంద్రబోస్ రాసిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ పాటను, పాట రాసిన చంద్రబోస్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిరంజీవి కరోనా కష్ట కాలంలో పోలీసుల కృషి చాలా గొప్పగా ఉందని ప్రశంసించారు. 
 
దయచేసి పోలీసులకు ప్రజలంతా సహకరించండి అని సూచించారు. చంద్రబోస్ రాసి, ఆలపించిన పాట ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉందని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: