కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మార్చి-24నుంచి విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా స్వస్థలాక వెళ్లలేక, ఉన్నచోట ఉపాధి కోల్పోయి, చేతిలో చిల్లిగవ్వలేక,వందల కిలిమీటర్లకు కాలినడకతో స్వస్థలాకు వెళుతూ లక్షలాదిమంది వలసకూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వలస కార్మికుల కష్టాలు తెలుసుకున్న కేంద్రం వారిని స్వస్థలాలకు చేరుకునే విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాదు వలస కార్మికులను స్వస్థలాకు తరలించేందుకు రైల్వేశాఖ శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే.  కొన్ని రాష్ట్రాలు వీటిపై అభ్యంతరం చెబుతున్నాయి. తమ రాష్ట్రాల మీదుగా రైళ్లను నడపవద్దని, తమ రాష్ట్రంలోని ఆపవద్దని డిమాండ్ చేస్తున్నాయి. శ్రామిక్ రైళ్లను నడిపేందుకు వీలు లేదని ఖచ్చితంగా చెబుతున్నాయి.

 

ఇదిలా ఉంటే.. ఆంఫన్ తుపాన్ ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు బుధవారం రాకపోకలు సాగించాల్సిన శ్రామిక్ స్పెషల్ రైళ్లను రద్దు చేశారు. భారీ వర్షాలు, ఉద్ధృతంగా వీస్తున్న గాలులతో చెట్లు పడిపోవడంతోపాటు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం వాటిల్లింది. దీంతో రెండు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే శ్రామిక్ స్పెషల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఓడరేవు ఉన్న పారాదీప్ నగరంలో అత్యధికంగా గంటకు 106 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. చంద్ బలీ, భువనేశ్వర్, బాలాసోర్ ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం వల్ల భారీగా గాలి వీస్తోంది. అసలు ఓ వైపు కరోనా కష్టాలతో నానా ఇబ్బందులు పుడుతున్న వలస కార్మికులు ఇప్పుడు పుండు మీద కారం జల్లినట్టు తుఫాన్ ఇబ్బందితో సతమతమవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: