టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో నితిన్ ఒకరు. జయం సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నితిన్, ఇటీవల వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన 'తమ్ముడు' సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. వకీల్ సాబ్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండటం, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత ఈ ప్రాజెక్టును నిర్మించడంతో సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం వంటి కారణాల వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేతులేత్తేసింది. ఈ సినిమాతో సీనియర్ నటి లయ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె వెండితెరపై కనిపించడంతో ఆమె అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ సినిమా ఫలితం నిరాశపరచడంతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌కు ఈ చిత్రం ఏమాత్రం ప్లస్ కాలేకపోయింది. కేవలం నటీనటులకే కాకుండా, నిర్మాత దిల్ రాజుకు కూడా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది.

 సాధారణంగా దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే మినీమమ్ గ్యారెంటీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తాయి, కానీ 'తమ్ముడు' ఫలితం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నితిన్ కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే, ఈ సినిమా ఒక పెద్ద అడ్డంకిగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుస విజయాలతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్న నితిన్‌కు ఈ సినిమా పరాజయం కెరీర్ పరంగా పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టింది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: