కరోనా వైరస్ ని సమర్ధవంతంగా ఎదుర్కొన్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ఆ దేశంలో వేగంగా కరోనా కేసులు నమోదు అవుతున్నా సరే చాలా వరకు సమర్ధవంతంగానే అక్కడి ప్రభుత్వం కరోనా వైరస్ ని కట్టడి చేసింది అని చెప్పవచ్చు. కరోనా కట్టడి లో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడం లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేయడం తో ఇప్పుడు కరోనా వైరస్ అక్కడ దాదాపుగా తగ్గింది అని భావించారు. 

 

అయితే అనూహ్యంగా ఆ దేశంలో కరోనా రెండో వేవ్ మొదలయింది. ప్రతీ రోజు కూడా 3 వేలకు పైగా కరోనా కేసులు ఆ దేశంలో నమోదు అవుతున్నాయి అని అక్కడి అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: