తెలంగాణలో రెవెన్యూ శాఖ అధికారుల తీరుపై ఎన్నో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ అధికారులు రైతుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది రెవెన్యూ అధికారులు అవినీతిపరులుగా మారిపోయారని రైతుల విషయంలో వచ్చేసరికి వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.

తాజాగా తెలంగాణలో ఒక రైతు వినూత్నంగా నిరసన చేసాడు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం పొన్నెకల్లుకు చెందిన రైతు వినూత్న నిరసన హాట్ టాపిక్ గా  మారింది. తన భూమి తనకి ఇప్పించాలని నాగలితో నడుస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ నాగలితో పాదయాత్ర చేశారు. సీపీని కలిసి తన బాధని చెప్పుకుంటా అని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: