కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో
కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20(అసెస్‌మెంట్ ఇయర్ 2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు తేదీని మరోసారి
కేంద్ర ప్రభుత్వం పెంచింది.
డిసెంబర్ 31 వ తేదీ వరకు పెంచగా ఇప్పుడు
జనవరి 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వైరస్ కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కు పన్ను చెల్లింపుదారులు పడుతోన్న ఇబ్బందులను గమనిస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది అని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఈ ఏడాది లో
డిసెంబర్ 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై చెల్లింపు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.