హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా రేవ్ పార్టీ నిర్వ‌హిస్తున్న‌ట్టుగా రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేష్ భ‌గ‌త్‌కు ముందుగానే స‌మాచారం వ‌చ్చింది. దీంతో పోలీసులు ప‌క్కా ప్లానింగ్‌తో రేవ్ పార్టీపై దాడి చేశారు. ఈ దాడి చేశాక అక్క‌డ ప‌రిస్థితి చూసిన పోలీసుల‌కు దిమ్మ‌తిరిగి పోయింది. 90 మంది యువకులతో పాటు కొంత మంది యువతులను పట్టుకున్నారు.

వీరు కాకుండా దాడి జ‌రుగుతోన్న స‌మ‌యంలో మ‌రో 10 మంది వ‌ర‌కు యువ‌కులు ప‌రార‌య్యారు. న‌గ‌ర శివారు ప్రాంతంలో నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం లో ఈ రేవ్ పార్టీ జరిగింది. మహేష్ భగవత్ కు అజ్ఞాత వ్య‌క్తులు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో 90 మంది యువ‌కుల‌తో పాటు కొంత మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇక ఇక్క‌డ నుంచి పెద్ద మొత్తంలో కండోమ్ ప్యాకెట్లు కూడా దొరికాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: