కరోనా దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంబిస్తుంది. ఈ మహమ్మారి గతంతో పోలిస్తే ప్రస్తుతం దీని ప్రభావం ప్రమాద స్థాయిలో కొనసాగుతుంది. రోజుకు దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈ మహమ్మారి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా వేలల్లోనే నమోదు అవుతుంది.  ఇక కోవిడ్ కారణంగా  ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడి అత్త నర్మదాబెన్ మోడీ అహ్మదాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమెకు కరోనా సోకడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు.   . 

మరింత సమాచారం తెలుసుకోండి: