దేశవ్యాప్తంగా కరోనా ఉధృతిగా ఉన్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించింది. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వివిధ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది.
ఈ రోజే ఏపీలోని తిరుపతి పార్లమెంటు, తెలంగాణలోని నాగార్జునా సాగర్
అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా జరగనుంది. వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు రావాలంటే కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని
కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రెండు టీకాలు తీసుకున్నట్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిపోర్టులు 48 గంటల ముందు తీసుకున్నదై ఉండాలని
కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.