దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్ తీవ్రత చాలా అధికంగా ఉంది. దేశం లో రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో దాదాపుగా 3 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

దేశం ఎదుర్కొంటున్న ఈ పెను సంక్షోభాన్ని తగ్గించేందుకు ఆయా దేశాలతో పాటు ఎంతో మంది ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. కోవిడ్ భారీ నుండి తప్పించుకునేందుకు ప్రధాన పాత్ర వహించే ఎన్ 95 మాస్కులను కొనుగోలు చేసి పంపిణీ చెయ్యనున్నట్లు ప్రకటించాడు. ఈ ఎన్ 95 మాస్కులను ఉతుక్కొని మళ్ళీ వాడవచ్చు. మాస్కూలు కూడా కొనలేని ధీన స్థితిలో ఉన్న వారికి మాస్కూలు పంపిణీ చెయ్యడం చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: