ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్‌ విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ భవనంలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసారు. 2020 - 2021 విద్య సంవత్సరానికి గాను ఈ ఫలితాలను విడుదల చేసారు. పోయిన ఏడాది కి సంబందించిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను 'www.bse.ap.gov.in' వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. స్టూడెంట్స్ యొక్క మెమొరాండమ్‌ ఆఫ్‌ సబ్జెక్టు వైజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ లను ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. పోయిన ఏడాది కరోనా కారణం గా జరగాల్సిన పరీక్షలు జరగకపోవడం ద్వారా ఫలితాలు ఆలస్యం అయ్యాయి. ఇక వచ్చే ఏడాది కూడా పరీక్షల ఫలితాలు ఈ పద్దతిలోనే జరిగే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: