కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలంగాణలో థియేటర్లు పూర్తిగా తెరుచుకున్నాయి. కానీ ఆంధ్రాలో మాత్రం థియేటర్స్ రీ ఓపెన్ చేయడానికి చాలా సమయం పట్టింది. అది కూడా 50 ఆక్యుపెన్సీతో... అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి మెగాస్టార్ కి ఆహ్వానం రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఏపీ ముఖ్యమంత్రి పేర్ని నాని మెగాస్టార్ చిరంజీవిి నేరుగా హైదరాబాద్ లో కలిసి ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ సంభాషణలో సినీ పెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సినీ, థియేటర్ సమస్యలతో పాటు ఇతరత్రా వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున పేర్ని నాని అడిగారని తెలుస్తోంది. ఈ కీలక భేటీలో థియేటర్ల సమస్య నుంచి టిక్కెట్ల రేట్లు వరకు, పంపిణీ వర్గాల వేతనాలతో సహా కార్మికుల బతుకు తెరువు గురించి చర్చించే అవకాశం ఉంది. ఈ నెల చివరి వారంలో ఏపీ సీఎంతో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: