వైయస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఆమె కెసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రణాళికబద్ధంగా కార్యాచరణను పాటిస్తున్నారు. ఈ క్రమంలో వైయస్ షర్మిల ఈ రోజు మహబూబా బాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా సోమ్లా తండా లో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. 

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు వైఎస్ షర్మిల. అనంతరం అదే జిల్లాలోని గుండెంగి గ్రామంలో షర్మిల ఉద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఈ రోజు రాత్రి వరంగల్ లో బస చేసి ఉద్యోగ దీక్ష, పోడు భూములపై పోరుకు రేపు శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా లింగాల గ్రామంలో షర్మిల పాదయాత్రలో పాల్గొంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ముగించిన తర్వాత రేపు సాయంత్రం షర్మిల హైదరాబాద్ కు చేరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: