
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే ఫాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. రీ ఎంట్రీ తర్వాత చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న చిరు... ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచారు. యువ డైరెక్టర్ లకు ఫెయిల్ అయిన డైరెక్టర్ లకు ఆయన అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆయన ఆచార్య సినిమా చేస్తుండగా... తర్వాత వరుసగా రెండు సినిమాలు ఫైనల్ చేశారు.
ఇప్పుడు అభిమానులు ఖుషీ అయ్యే ప్రకటన చేసింది మైత్రీ మూవీ మేకర్స్. సంస్థ నిర్మాణ సారధ్యంలో బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు చిరంజీవి. ఈ సినిమాను అధికారికంగా రేపు ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు సినిమా ప్రకటిస్తామని బాబీని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ని ట్యాగ్ చేసింది. ఈ సినిమా చిరంజీవి 154 వ సినిమాగా ప్రస్తావించింది. కాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ముందు 154 చేస్తారని భావించినా... అది 155కి మారింది. రేపు రెండు సినిమాలు చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ప్రకటించనున్నారు.