63 కోట్ల కు చేరుకున్నది తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారం. సి సి ఎస్ లో మరో ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ. ఇక ఇప్పటికే ఇక్కడ తెలుగు అకాడమీ పై మూడు కేసులు నమోదు అయ్యాయి. తెలుగు అకాడమీ సంబంధించిన అధికారులు తో పాటుగా యూనియన్ బ్యాంకు ప్రతినిధులను ప్రశ్నిస్తున్న పోలీసులు... నిధుల బదలాయింపులో అగ్రసేన్ బ్యాంకు తో పాటు రత్నాకర్ బ్యాంకు ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసారు.

యూనియన్ బ్యాంక్ నుంచి బదిలీ అయిన నిధులు మొత్తం ఒకే అకౌంట్ కు చేరినట్టు గా గుర్తించారు. తెలుగు అకాడమీ, యూనియన్ బ్యాంక్ మధ్య ఏజెంట్ గా వ్యవహరించిన వ్యక్తుల పైన పోలీస్ లు గురి పెట్టారు. కార్వాన్ బ్యాంకు నుంచి నలభై మూడు కోట్లు , సంతోష్ నగర్ బ్యాంకు నుంచి పది కోట్లు,  చార్మినార్ బ్యాంకు నుంచి పది కోట్లు బదిలీ అయ్యాయి అని విచారణలో గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: