తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆయన్ను మచిలీపట్నం జైలుకు ఈడ్చుకెళ్లారు. దేశ ద్రోహానికి పాల్పడిన నిందితుడి తరహాలో పట్టాభి రామ్‌ను పోలీసులు కాలర్‌ పట్టుకుని, చేతులు వెనక్కి విరిచి, చొక్కా అంతా పైకి పోయేలా.. ఆయన బరబరా ఈడ్చుకుంటూ మచిలీపట్నం జైలులోకి తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగం కింద ఆయన్ను బుధవారం రాత్రి అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్‌ చేశారు పోలీసులు. తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారణ జరిపారు. అనంతరం విజ‌య‌వాడ‌ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన కోర్టు పట్టాభి రామ్‌కు 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు. అక్కడ వాహనం నుంచి దిగిన పట్టాభి రామ్‌ను పోలీసులు ఈడ్చుకుంటూ జైలులోకి తీసుకెళ్లిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: