మానవుడు కోతి నుండి వచ్చాడని కొందరు అంటుంటారు. తొలుత మానవునికి తోకలు ఉండేవని, అవి కాస్త క్రమేణ అంతరించి పోయాయని పేర్కొంటుంటారు మరికొందరు. మానవుని పరిణామ క్రమంలో చోటు చేసుకున్న మార్పుల ఆధారంగా తోక లేకుండా పోయిందని పరిశోధకులు వెల్లడిస్తుంటారు. ఎవరికి తోచిన విధంగా వారు అంటుంటారు. కానీ తాజాగా బ్రెజిల్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకున్నది.
ఒక బాలుడు తోకతో జన్మించాడు. ఆ తోక దాదాపు 12 సెం.మీ. పొడవు ఉన్నది. తోక చివరన గద మాదిరిగా ఒక బంతిలాగా ఉంది. అయితే కొన్ని రకాల జన్యుపరమైన మార్పుల కారణంగానే పిల్లలు ఈ విధంగా జన్మిస్తుంటారని వైధ్యులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా బ్రెజిల్‌లోని ఫొల్టేజాలో 12 సెంటిమీటర్లు గల పొడవు తోకతో పుట్టడం వైద్యరంగంలో అత్యంత అరుదు అని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. నెలలు కూడ నిండకుండా ఆ బాలుడు పుట్టాడని.. అంతేకాకుండా ఆ బాలుడి పిరుదు నుండి తోక ఉందని వివరించారు. ఆ తోకలో మృదులాస్తి లాంటి ఎముక కూడ లేదని తెలిపారు డాక్టర్లు.
నిజమైన మానవునికి సంబంధించిన తోక అని వైద్యులు తెలిపారు. శిశువు నాడి వ్యవస్థకు తోక అనుసంధానం లేదని, అందుకే దీనిని ఆపరేషన్ చేసి తొలగించినట్టు డాక్టర్ల బృందం వెల్లడించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: