ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జికా వైర‌స్ కేసులు రోజు రోజుకు విప‌రీతంగా పెరుగుతున్నాయి. తాజాగా నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల‌లో దాదాపు 105 మందికి జికా వైర‌స్ కేసులు న‌మోదు అయిన‌ట్టు వైద్య అధికారులు వెల్ల‌డించారు. కేసుల‌ను గుర్తించ‌డానికి ఇప్ప‌టికే 100 వైద్య బృందాలు రంగంలోకి దిగినాయి. ఇంటింటికి వెళ్లి అనుమానితుల నుంచి సాంపిళ్ల‌ను సేక‌రిస్తున్నారు. 109 మంది మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో  జికా వైరస్‌ కలకలం సృష్టిస్తున్న‌ది. ఇప్పటికే దేశంలోని కొన్ని చోట్ల జికా వైరస్ విజృంభిస్తుండగా..  గత వారం రోజులుగా కాన్పూర్‌లో పెరుగుతున్న జికా వైరస్  కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్న‌ది. దోమల ద్వారా సంక్రమించే  ఈ కేసుల సంఖ్య బారీగానే 100కు పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి.  బాధితుల్లో ఒక గర్భిణీ, 17 మంది పిల్లలు ఉండటం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. జికా వైరస్ ను అరిక‌ట్టేందుకు వైద్య బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు కాన్పూర్ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ నేపాల్ వెల్ల‌డించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: