ఇటీవల నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. అధికారంలో ఉన్న ఒక రాష్ట్రాన్ని పొగొట్టుకుంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. యూపీ వంటి 403 అసెంబ్లీ సీట్లు ఉన్న పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకోవడం అంటే సాధారణ పరాజయం కాదు.


ఈ నేపథ్యంలో ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియానే ఉండాలని  సీడబ్ల్యూసీ భేటీ నిర్ణయించింది. నాలుగు గంటల పాటు సాగిన సమావేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ  సీడబ్ల్యూసీ మీటింగ్‌ గంటల తరబడి సాగింది. చివరకు ప్రస్తుతానికి సోనియా గాంధీనే నాయకురాలిగా ఉండాలని పార్టీ కీలక ప్రతినిధులు కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: