తెలుగు రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. కొన్నిచోట్ల జోరుగా.. మరికొన్నిచోట్ల ముసురుగా.. వర్షం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏపీ వాసులకు మరో ఇబ్బంది సమ్మె రూపంలో ఎదురైంది. ఇవాళ్టి నుంచి పట్టణ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన చేస్తున్నారు. నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్టు 35 వేల మంది కార్మికులు ప్రకటించారు. తమ 9 ప్రధాన డిమాండ్ల సాధన కోసం పారిశుద్ధ్య కార్మికుల పోరు సాగిస్తున్నారు.


11వ పీఆర్సీ ప్రకారం వేతనం, భత్యం కావాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై వారు అధికారులతో చర్చలు జరిపారు. అయితే.. ఆ చర్చలు విఫలం అయ్యాయి. దీంతో కార్మికులు ఇవాళ్టి నుంచి సమ్మెబాట పట్టారు. ఈ మేరకు గతనెలలోనే సమ్మె నోటీసులు కార్మిక సంఘాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు వర్షం ముంచుకొస్తున్న సమయంలో మున్సిపల్ కార్మికుల సమ్మెతో ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: