టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌, గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ సతీమణితో అక్రమ సంబంధం ఉందని అమెరికా మీడియా కోడైకూస్తోంది. ఇప్పుడు దీనిపై మరోసారి మస్క్ స్పందించారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ సతీమణితో తనకు ఎలాంటి సంబంధం లేదని మస్క్ కొట్టి పారేశారు. సెర్గీ భార్యతో తాను కలలో కూడా అలాంటి పని చేయలేదని చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఇవన్నీ చెత్త కథనాలు. సెర్గీ, నేను మంచి మిత్రులం అంటున్నాడు.


ఇటీవలే మేం పార్టీ కూడా చేసుకున్నామంటున్న మస్క్..  ఈ మూడేళ్లలో నికోల్‌ను రెండుసార్లు మాత్రమే చూశానంటూ కవర్ చేస్తున్నారు. అంతే కాదు..  అప్పుడు మా చుట్టూ చాలా మంది ఉన్నారని.. రొమాంటిక్‌గా ఏమీ జరగలేదని మస్క్ మరింతగా వివరణ ఇచ్చారు. అయితే.. బిలియనీర్‌ సెర్గీ బ్రిన్‌ ఆయన భార్య నికోల్‌ షెనహన్‌ ఈ జనవరిలో విడాకులకు అప్లయ్ చేసింది. మస్క్‌తో ఎఫైర్ కారణంగానే ఆమె విడాకులు కోరుతోందని వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: