కేంద్రం కొత్తగా విద్యుత్ చట్ట సవరణ బిల్లు తీసుకురాబోతోంది. ఇది చట్టం అయితే.. దేశమంతా పక్కాగా విద్యుత్‌ సరఫరా జరిగేలా చూసే పూర్తి అధికారం జాతీయ లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రం.. ఎన్‌ఎల్‌డీసీకే ఉంటుంది. దేశంలో ప్రతి సబ్‌స్టేషన్‌, విద్యుదుత్పత్తి కేంద్రం, పంపిణీ సంస్థ వంటివన్నీ  ‘జాతీయ లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రం’ ఆదేశాలను పాటించాల్సిందే. కొత్త ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీలు తగ్గించాలన్నా, పెంచాలన్నా సంబంధిత టారీఫ్‌ సవరణ ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా డిస్కంలు ఈఆర్‌సీకి ఇవ్వాల్సి ఉంటంది.


ఈఆర్సీ వాటిపై 90 రోజుల్లోగా విచారణ జరిపి తుది ఆదేశాలిస్తుంది. ఇంతకాలం ఈ విచారణ గడువు 120 రోజులుండేది. దీన్ని 90కి తగ్గింస్తారు.  కాలుష్యం తగ్గించాలనే లక్ష్యంతో సౌర, పవన, జలవిద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తారు. ఈ ఇంధనాన్ని తప్పనిసరిగా డిస్కంలు నిర్ణీత శాతం కొనాల్సిందే. అలా కొనకపోతే  డిస్కంలకు ఈఆర్‌సీ యూనిట్‌కు 35 నుంచి 50 పైసల చొప్పున జరిమానా వేస్తుంది. మరి ఈ కొత్త చట్ట సవరణ కరెంట్ చార్జీలు పెంచేస్తుందా.. తగ్గిస్తుందా.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: