టీడీపీ నేత నారా లోకేశ్‌ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. సీఎం జగన్, ఎమ్మెల్యే ఆర్కేలపై పంచ్ డైలాగులు విసిరారు. జిల్లాకో విమానాశ్రయం అని పెద్ద సైకో అంటే, ఇప్పటానికి విమానాశ్రయం తెస్తానంటూ చిన్న సైకో ఇళ్లు కూల్చాడని నారా లోకేష్ విమర్శించారు. ఇప్పటం గ్రామానికి వందల కోట్లు ఖర్చు పెట్టామoటూ ఏర్పాటు చేసిన బ్యానర్ల పై సవాల్ కు సిద్ధమని లోకేశ్ స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైన్ లకు వైకాపా ఖర్చు చేసామంటున్న రోడ్లెక్కడా, డ్రైన్లు ఎక్కడా అని టీడీపీ నేత నారా లోకేశ్‌ ప్రశ్నించారు.

ఎస్ ఆర్ ఎం కి ఉన్న రోడ్డుని చెరువుగా మార్చిన వాళ్ళు ఇప్పటంలో ఇళ్లు కూల్చి రోడ్డేస్తారా అని  టీడీపీ నేత నారా లోకేశ్‌ నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం వేసిన డ్రైన్లకు తమ పేర్లు వేసుకోవటానికి సిగ్గుండాలని నారా లోకేశ్ మండిపడ్డారు.  సీఎం ఇంటి చుట్టు  చేసుకునే భద్రతా ఏర్పాట్లను మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి ఖాతాలో చూపటం సిగ్గుచేటని టీడీపీ నేత నారా లోకేశ్‌  దుయ్యబట్టారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: