మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన అయ్యప్ప మాలలో ఉండి ముస్లిం టోపీ ధరించడం వివాదాస్పదం అవుతోంది. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీరుపై బీజేపీ యువ మోర్చా మండిపడుతోంది. అనిల్‌ తీరుపై బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టా వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయ్యప్ప మాలలో ఉండి అనిల్ పబ్లిసిటీ స్టంట్లు వేసిన అనిల్ ఇప్పటికీ పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విమర్శించారు. ముస్లింలు, క్రిస్టియన్ కు తాము వ్యతిరేకం కాదని, వారి అభివృద్ధికి బిజెపి తోడ్పాటు అందిస్తుందని స్పష్టం బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేశారు. మత సామరస్యం గురించి చెబుతున్న అనిల్.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా అయ్యప్ప గుడికి వస్తారా చెప్పాలని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేల కోసం మేం అయ్యప్ప స్వాముల వస్త్రాల తో కూడిన పార్శిల్ ను అనిల్ కుమార్‌కు పంపిస్తున్నట్లు బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: