ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో అక్రమాలు వెలుగు చూస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ అక్రమాలకు వాలంటీర్లే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 3, 5, 10, ఇంటర్ విద్యార్హతలున్న వారిని కూడా డిగ్రీ చదివినట్టు చూపిస్తూ దరఖాస్తులు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒకరి పేరుతోనే నాలుగైదు అప్లికేషన్లు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం నియోజకవర్గంలో విశాఖ జిల్లాలో 2,163 మంది అనర్హులను ఓటరుగా నమోదు చేశారని  ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఇటీవల ఫిర్యాదు చేసింది. 8,486 మంది పేర్లు జాబితాలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఉన్నాయని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తెలిపింది. వాలంటీర్లు ఎన్ని దరఖాస్తులిచ్చినా పరిశీలించకుండానే ఆమోదించేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి . వాలంటీర్లు  అధికార పార్టీకి అనుకూలమైన వారినే చేర్పిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చాలా మంది డిగ్రీ పట్టాకు బదులుగా ఏదో ఒక పత్రాన్ని కానీ.. ఇతరుల పట్టాలను కానీ అప్లోడ్ చేసినట్టు విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: