హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ కంపెనీ వచ్చేసింది. అమెరికాకు చెందిన క్యూబిక్ ట్రాన్స్ పోర్టేషన్ సిస్టమ్స్.. సీటీఎస్ హైదరాబాద్‌లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. మాదాపూర్ లో కొత్తగా నిర్మించిన కార్యాలయాన్ని సంస్థ అధ్యక్షుడు జెఫ్రే లోవింగర్ ప్రారంభించారు. ఈ సంస్థ ప్రజారవాణా వ్యవస్థకు ఐటీ ని జతచేసి టికెట్ల కొనుగోళ్లను నిర్వహింస్తుంటుంది. ఏడాదిలోపు భారత్ లో 150 మంది కొత్త సిబ్బందిని నియమించాలని ఈ సంస్థ నిర్ణయించింది.

2009లో తొలిసారి హైదరాబాద్ లో ఈ సంస్థ  15 మంది సిబ్బందితో కార్యకలాపాలను ప్రారంభించింది.  ప్రస్తుతం క్యూబిక్ ట్రాన్స్ పోర్టేషన్ లో దాదాపు 450 మంది పనిచేస్తున్నారని.. లండన్, న్యూయార్క్, సాన్ ఫ్రాన్సిస్కో మున్సిపల్ ట్రాన్స్ పోర్టేషన్  ఏజెన్సీ, చికాగో ట్రాన్సిట్ అధారిటీల పేమెంట్ లావాదేవీలను నిర్వహించిన అనుభవం క్యూబిక్ ట్రాన్స్ పోర్టేషన్ కి ఉందని.. హైదరాబాద్ లోనూ మెట్రో సహా పలు ప్రాజెక్టుల వల్ల క్యూబిక్ కి మెరుగైన అవకాశాలు ఉన్నాయని నిర్వాహాకులు  చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: