ఈ నెల 9వ తేదీన కరీంనగర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్‌ వెల్లడించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీష్‌గడ్‌ సీఎం భూపేష్‌ భగేల్‌ హాజరవుతారని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్‌ తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగానే కరీంనగర్‌లో సభ ఏర్పాటని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్‌ స్పష్టం చేశారు.


కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తమ కష్టాలు తొలగుతాయని ప్రజలు భావిస్తున్నారని మహేష్‌కుమార గౌడ్‌ వివరించారు. చెరుకు సుధాకర్ ఆంశాన్ని పీసీసీకి ఫిర్యాదు చేశారని తాము ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు  టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్‌  పేర్కొన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు పై కరీంనగర్‌లో వాగ్దానం చేసి నిలుపుకున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు ఛామల కిరణ్ తెలిపారు. అందుకే కాంగ్రెస్ కూడా అక్కడే సభ పెడుతోందని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: