తరచూ ఎల్లో మీడియా అంటూ విమర్శలు చేసే ఏపీ సీఎం జగన్.. ఈసారి నేరుగా రామోజీరావుపైనే విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను ఎల్లో మీడియా విపత్తుగా చూపిస్తోందన్న సీఎం జగన్.. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారని గుర్తు చేశారు. ఈ ఖాళీలగుండా వరదనీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్‌ దారుణంగా దెబ్బతిందని జగన్ అన్నారు.


టీడీపీ సర్కారు నిర్లకష్యం వల్ల ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాదు, రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్న సీఎం జగన్.. ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదన్నారు. ఎందుకంటే.. రామోజీరావు బంధువులకే నామినేషన్‌ పద్ధతిలో చంద్రబాబు పనులు అప్పగించేశారని విమర్శించారు. ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేనిది గైడ్‌వాల్‌ అని..  ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులాగ చూపించే ప్రయత్నంచేస్తున్నారని జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: