భారత వ్యాపార రంగంలో ఉవ్వెత్తున ఎగిసిన కెరటం గౌతమ్ అదానీ. ప్రపంచ కుబేరుల స్థానంలో దాదాపు నెంబర్ వన్ స్థానానికి చేరువవుతున్న వేళ ఆయన సంస్థలపై, పెట్టుబడులపై హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదిక అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసేసింది. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల షేర్లు పడిపోయాయి. మార్కెట్లో అదానీ షేర్లు పతానవస్థకు చేరుకుని అధ:పాతాళానికి చేరుకున్నాయి. గతేడాది నుంచి అదానీ సంస్థలపై జరిగిన ప్రచారంతో అదానీ షేర్ల రూపంలో నాలుగు ట్రిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.


దీనికంతటికి కారణం విదేశీ వ్యాపార వర్గాలు అనే విషయం అనంతరం జరిగిన పరిణామాల వల్ల తెలిసింది. ప్రపంచంలో ని వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇండియాకు వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నాయి. కానీ ఆ వ్యాపారాన్ని ఇండియాకు చెందిన పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు చేస్తే మాత్రం అవి సహించలేకపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: