ఏపీకి తుపాన్‌ గండం పొంచి ఉంది. అందుకే రైతులు నష్టపోకుండా వ్యవసాయ, ఉద్యానవన పంటల గురించి తగిన సూచనలు చేయాలని.. చేపలగుంటల్లో నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులేవరూ కూడా వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. లోతట్టు ప్రాంతాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని తీర ప్రాంతాల కలెక్టర్లు ఆదేశిస్తున్నారు.


ప్రత్యేకించి పూరిగుడిసెలు ఉన్న ఎస్టీ కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పునరావాస కేంద్రాల్లో మంచినీరు, నాణ్యమైన ఆహారం ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందించాలి. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కరెంటు లేని సమయంలో కూడా ఐసీయూ, వార్డులు పనిచేసేలా ఇన్వర్టర్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలి. రెసిడెన్షియల్ కళాశాలలు, పాఠశాలలను క్షుణ్ణంగా పరిశీలించాలి. బలహీన కట్టడాలు ఉన్న బిల్డింగ్ ల నుంచి సురక్షిత ప్రాంతాలకు విద్యార్థులను తీసుకెళ్లేలా చూడాలి. విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ వైర్లు, స్తంభాల ఇబ్బందులు రాకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: