ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు రాబోతున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగినా.. కొన్ని కీలకమైన స్థానాలపైనే అందరి కళ్లు ఉన్నాయి. గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేసిన సీఎం కేసీఆర్‌ రెండు చోట్లా గెలుస్తారా లేదా అన్న ఉత్కంఠ ఉంది. ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌, సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీష్‌రావు పోటీ చేశారు.

 
బాన్సువాడ నుంచి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేశారు. ఇక కాంగ్రెస్‌ నుంచి.. కొడంగల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో రేవంత్‌రెడ్డి పోటీ చేశారు. మధిర నియోజకవర్గంలో సీఎల్పీ భట్టి విక్రమార్క, ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు, పాలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేశారు. బీజేపీ నుంచి గజ్వేల్‌, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ పోటీ చేశారు.  కరీంనగర్‌లో భాజపా ఎంపీ బండి సంజయ్‌, బోథ్‌ నుంచి భాజపా ఎంపీ సోయం బాపూరావు, దుబ్బాక భాజపా అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: