ఇవాళ తెలంగాణ  బీజేపీ  రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జులు, ముఖ్య నేతల సమావేశం నిర్వహిస్తారు. కిషన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి తరుణ్‌ చుగ్‌, లక్ష్మణ్‌  ముఖ్య అతిధులుగా హాజరవుతారు. వికసిత భారత్‌, విశ్వకర్మ పథకాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది.

 వికసిత భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తోంది. అన్ని గ్రామాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో యాత్రలు నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ యాత్రలో బీజేపీ శ్రేణులు విశ్వకర్మ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విధంగా కార్యచరణను రూపొందిస్తున్నారు. వికసిత్ భారత్‌ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున డ్రైవ్ చేపట్టాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp